Corona vaccine: వ్యాక్సిన్ కొనేందుకు చీఫ్ మినిస్టర్స్ డిస్ట్రెస్ ఫండ్‌కు విరాళాల వెల్లువ
కరోనా టెస్ట్ ఫైల్ ఫోటో
Corona vaccine: కరోనా నియంత్రణలో కేరళ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారు. వ్యాక్సిన్‌లను ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే వేలాది మంది కేరళీయులు తమ ప్రభుత్వానికి చేయూతనందించడానికి రెడీ అయ్యారు. వ్యాక్సిన్‌ను కొనేందుకు చీఫ్ మినిస్టర్స్ డిస్ట్రెస్ ఫండ్‌కు ఉదారంగా విరాళాలు అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఆదాయం తగ్గడంతో ప్రజలు స్పందిస్తున్నారు. విరాళాలు ఇచ్చిన వారు తమ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. మిగిలినవారు కూడా ఉత్సాహంగా ప్రభుత్వానికి సాయపడుతున్నారు. ఎటువంటి సంక్షోభాన్నిఎదుర్కొనడానికైనా ప్రజల మద్దతే తమకు బలమని కేరళ సీఎం పినరయ్ విజయన్ చెప్పారు.