Zika Virus: కేరళలో జికా వైరస్ అలజడి

Zika Virus: జికా బాధితుల సంఖ్య 15కు చేరినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

Update: 2021-07-11 08:29 GMT

Zika Virus In Kerala

Zika Virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అనేక రూపాంతరాలు చెందుతూ మానవాళికే ఛాలెంజ్ విసురుతోంది. రోజు రోజూ ఆ మహమ్మారి అనేక రూపాంతరాలు చెందుతూ కొత్త వైరస్ లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టకుండానే కేరళను మరో వైరస్  అలజడి సృష్టిస్తోంది. దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ కేరళలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జికా బాధితుల సంఖ్య 15కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ రోజు వెల్లడించారు.

నంతన్‌కోడ్‌కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామన్నారు. ఆ నమూనాలను అల్లాపూజాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించామని.. రిపోర్టులో అతనికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆమె వెల్లడించారు. మిగిలిన 14 మంది తిరువనంతపురానికి చెందినవారని వీణా జార్జ్‌ పేర్కొన్నారు. జికా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.

జికా వైరస్‌పై అప్రమత్తమైంది కేంద్ర ఎయిమ్స్‌కు చెందిన ఆరుగురు నిపుణుల బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించింది. అక్కడి పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించనుంది. ఈ బృందంలో సీనియర్‌ వైద్యులతో పాటు అంటువ్యాధుల నిపుణులు ఉన్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా జికాపై అలర్ట్‌ అయింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతోంది.



Tags:    

Similar News