Kejriwal weapons on COVID-19: కరోనాపై కట్టడికి ఈ అయిదు సూత్రాలే ఆయుధాలు: సీఎం కేజ్రీవాల్‌

Kejriwal weapons on COVID-19: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.. శనివారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 2,948 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Update: 2020-06-27 17:06 GMT

దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.. శనివారం ఒక్కరోజే అక్కడ కొత్తగా 2,948 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు మొత్తం 80,188 కేసులు నమోదయ్యాయని, ఇందులో 28,329 పాజిటివ్‌ కేసులున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.. అయితే కరోనా కట్టడికి ఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకొని ముందుకి వెళ్తున్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు.. కరోనాపై యుద్ధానికి ఆస్పత్రుల్లో రోగులకు పడకలు పెంచడం, టెస్టింగ్ - ఐసోలేషన్‌, ఆక్సీమీటర్ల పంపిణీ, ప్లాస్మా థెరఫీ, ఇంటింటి సర్వే- స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహణ.. ఈ ఐదు అంశాలను ఆయుధాలుగా చేసుకున్నామని ఆయన అన్నారు.

భవిష్యత్తులో కరోనా కేసులు పెరిగిన్నప్పటికి వాటికి అందుకవసరమైన వసతులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు..ఇప్పటివరకు ఢిల్లీలో 13500 పడకలు ఏర్పాటు చేయగా అందులో 6000 పడకలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయమని మిగిలిన 7500 పడకలు ఖాళీగా ఉన్నట్టుగా కేజ్రీవాల్ వెల్లడించారు.. ఇక కరోనా నిర్ధారణ పరీక్షలను నాలుగు రెట్టు పెంచినట్టుగా ఆయన స్పష్టం చేశారు.. ఇప్పటివరకు దిల్లీలో 4,59,156 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అందులో నిన్న ఒక్క రోజే అత్యధికంగా 21,144 పరీక్షలు చేశామని వెల్లడించారు.. ఇక రోగులను ఐసోలేషన్‌ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా ఆయన వివరించారు.

ఢిల్లీలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు ఆక్సీమీటర్లను పంపిణీ చేస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకొనేందుకు వీటిని పంపిణీ చేస్తున్నామనీ తెలిపారు.. ఇక అటు కరోనా కట్టడి విషయంలో కేంద్రం అందిస్తున్న సహకారానికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు...

ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు విషయానికి వచ్చేసరికి.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,552 కేసులు నమోదు కాగా, 384 మంది ప్రాణాలు కోల్పోయారు..తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 5,08,953 కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,97,387 ఉండగా, 2,95,880 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 15,685 మంది కరోనా వ్యాధితో మరణించారు.  

Tags:    

Similar News