Coronavirus: ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం

Coronavirus: ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం
x
Highlights

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనిని నియంత్రించడానికి ఏ దేశాలకు సాధ్యపడటం లేదు. నెలలతరబడి పరిశోధనలు చేస్తున్నా ఫలితం లేకుండా ఉంది.

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దీనిని నియంత్రించడానికి ఏ దేశాలకు సాధ్యపడటం లేదు. నెలలతరబడి పరిశోధనలు చేస్తున్నా ఫలితం లేకుండా ఉంది.దీనికి విరుగుడు తయారుచేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సైతం బుర్రబద్దలు కొట్టుకుంటోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టిసారించింది ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయం.. దీనికి సంబంధించి ఓ కీలకమైన ప్రకటన చేసింది.

కరోనా వ్యాధికి రాబోయే ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ తయారు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి అయ్యాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ను మూడవ దశ ట్రయల్ తరువాత కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ తయారవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచే అవకాశం ఉందని.. ఆ విధంగా లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ తెలిపారు. 18 మరియు 55 సంవత్సరాల మధ్య వయస్సు గల 500 మందికి పైగా వాలంటీర్లు పరిశోధనకు సంబంధించి సంతకం చేశారు. ఈ నెలాఖరులో వారిపై పరీక్షలు ప్రారంభిస్తారు.. ఆ తరువాత సరైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. కనీసం ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో విజయవంతం అవవడానికి 2021 అవుతుంది.. ఆ ఏడాదే పూర్తిస్థాయి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆయన చెప్పారు.

ఇప్పటికే చైనాలో మార్చి 17నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్టు పరిశోధకులు వెల్లడించారు .మొదటిదశలో చైనాకు చెందిన కొందరు వాలంటీర్లపై వ్యాక్సిన్‌ ప్రయోగం చేసినట్టు తెలిపారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసున్న ఆరోగ్యవంతమైన వ్యక్తులు మొత్తం 108 మందిపై పరిశోధనలు జరిపామని.. ప్రస్తుతం 18మంది అబ్టర్వేషన్‌ పూర్తయిందని, వారు కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారని చెప్పారు.

అంతేకాదు 14 రోజుల పాటు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో బుధవారం తమ ఇళ్లకు వెళ్లినట్టు వారు. అయితే వారు ఇళ్లకు వెళ్లినా మరో ఆరునెలల పాటు తమ ఆధీనంలోనే ఉంటారు.. వీరినుంచి రక్త నమూనాలు సేకరిస్తూ, పరిశోధనలు జరుపుతామని, అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories