Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది.

Update: 2025-10-13 06:21 GMT

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది.

గత నెలలో టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మందికి గాయపడ్డారు. ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆదేశించింది. తమ పార్టీ పట్ల సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని.. ఈ మేరకు తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపించిన సుప్రీంకోర్టు.. 41 మంది మృతిచెందిన తొక్కిసలాట ఘటన దేశాన్ని కదిలించిందని పేర్కొంది. ఈ మేరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

Tags:    

Similar News