కర్నాటక సీఎం మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ.. మంత్రులు, ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ వరుస మీటింగ్స్
Karnataka CM Suspense: కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Karnataka CM Suspense: కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిష్టానం సూచనతోనే బలం పెంచుకునే పనిలో డీకే ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటోన్నారు. సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోళీతో డీకే రహస్య సమావేశమవ్వడంతో సీఎం మార్పు ఖాయమేమోనని అనిపిస్తోంది. డీకే శివకుమార్‌కు రాహుల్‌గాంధీ నుంచి "వైట్ ఐ విల్ కాల్ యూ" అన్న సందేశం వచ్చినట్లు సమాచారం.
రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగవచ్చని ఊహాగానాలు సాగుతున్న వేళ డీకేకు రాహుల్ నుంచి ఈ మెసేజ్ రావడం ప్రాధ్యానతను సంతరించుకుంది. ఎల్లుండి ఢిల్లీ వెళ్లేందుకు డీకే సన్నద్ధం అవుతున్నారు. సోనియాగాంధీని కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరిన డీకే అదేరోజున బెంగళూరుకు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు వరకు సీఎం మార్పుపై క్లారిటీ వస్తోందంటున్నారు పార్టీ నేతలు.