Kanpur Encounter : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరులు ఎన్‌కౌంటర్‌

Update: 2020-07-09 03:51 GMT

Kanpur Encounter : ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ముఠాలో ఒక్కక్కరు హతమవుతున్నారు. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే కోసం గాలిస్తున్న క్రమంలో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని కాల్చి చంపిన పోలీసులు, ఈ రోజు తెల్లవారుజామున దూబే సన్నిహితుడు రణబీర్‌ అలియాస్‌ బబ్బన్‌ శుక్లాను, మరో అనుచరుడు కార్తికేయను ఎన్‌కౌంటర్‌ చేశారు.

స్కార్పియోలో వచ్చిన నలుగురు సాయుధ దుండగులు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బకేవార్ పీఎస్ పరిధిలోని మహేవా వద్ద జాతీయ రహదారిపై స్విఫ్ట్ డిజైర్ కారును దోపిడీ చేసారని, ఆ కారును సివిల్ లైన్స్ పీఎస్ పరిధిలోని కచౌరా రోడ్డుపై పోలీసులు చేజ్ చేశారని, దాంతో స్విఫ్ట్ డిజైర్ ఓ చెట్టును ఢీకొట్టిందని, వెంటనే దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారని, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని. ఇందులో ఒక వ్యక్తి గాయపడగా, మరో ముగ్గురు తప్పించుకుపోయాడని. గాయపడిన వ్యక్తిని దవాఖాన తరలించగా, అతడు మరణించాడని ఎటావా ఎస్‌ఎస్పీ ఆకాశ్‌ తోమర్‌ వెల్లడించారు. ఘటనా స్థలంలో ఒక పిస్టల్‌, డబుల్‌ బారెల్‌ గన్‌, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

Tags:    

Similar News