Kangana Ranaut: నాకు సీటు ఇవ్వగానే కాంగ్రెస్ ఛీప్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది
Kangana Ranaut: నాకు సీటు ఇవ్వగానే కాంగ్రెస్ ఛీప్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది
Kangana Ranaut: నాకు సీటు ఇవ్వగానే కాంగ్రెస్ ఛీప్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది
Kangana Ranaut: తనకు సీటు రాగానే కాంగ్రెస్ నేతలు ఛీప్ పాలిటిక్స్ ప్లే చేశారని మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండిపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి సిటీలో తొలిరోజు భారీ ర్యాలీ నిర్వహించారు కంగనా. ప్రచారంలో భాగంగా తొలిరోజే కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కంగనా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోయిందని.. రాహుల్ గాంధీని విమర్శించారు. శక్తికి వ్యతిరేకంగా పోరాడుతామని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.