Sahadev Soren: జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి

Jharkhand Encounter Top Maoist Leader Sahadev Killed

Update: 2025-09-15 05:59 GMT

Sahadev Soren: జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి

Sahadev Soren: జార్ఖండ్‌లోని హజారీబాగ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ మృతి చెందాడు. ఆపరేషన్ 'కగార్'లో భాగంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో సహదేవ్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతి చెందిన సహదేవ్‌పై రూ. కోటి రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Full View


Tags:    

Similar News