నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఇవి తప్పనిసరి..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష నేడు జరగుతుంది..

Update: 2020-09-27 02:20 GMT

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష నేడు జరగుతుంది. పరీక్ష కోసం IIT ఢిల్లీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా 2,50,000 మంది అభ్యర్థులు అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. 1st పేపర్ ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ, 2nd పేపర్ మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకూ జరగనుంది. అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి లేదు..

కంప్యూటరాధారితంగా ఆబ్జెక్టివ్‌ తరహాలో పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.. సొంతగా మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలి.. ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర గ్యాడ్జెట్స్ కు అనుమతి లేదు, అలాగే బూట్లు ధరించకూడదు. అడ్మిట్ కార్డులు ఇన్విజిలేటర్ కే ఇవ్వాలి.. అడ్మిట్ కార్డు తో పాటు ఇతర అధికారిక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇక covid సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 5వ తేదీన జేఈఈ ఫలితాలు వెల్లడించనున్నారు.

Tags:    

Similar News