Jaishankar: చమురు కొనుగోలు విషయంలో కుండబద్దలు కొట్టేసిన జయశంకర్

Jaishankar: భారత్ కొంటున్న చమురు మీద అంత దృష్టి పెడుతున్న మీరు.. ముందు యూరప్ సంగతి చూడండి

Update: 2022-04-13 06:15 GMT

చమురు కొనుగోలు విషయంలో కుండబద్దలు కొట్టేసిన జయశంకర్

Jaishankar: రష్యా చమురు కొనుగోలు విషయంలో విదేశాంగ మంత్రి జయశంకర్ కుండబద్దలుకొట్టేయడం విపక్షాల ప్రశంసలనూ అందుకుంది. భారత్ కొంటున్న చమురు మీద అంత దృష్టిపెడుతున్న మీరు, ముందు యూరప్ సంగతి చూడండి. ఇంధన భద్రత మా హక్కు. రష్యా నుంచి యూరప్ ఓ మధ్యాహ్నం పూట కొంటున్నదానికంటే భారతదేశం నెలకుసరిపడా కొనుక్కుంటున్నది ఎంతో తక్కువని జయశంకర్ జవాబిచ్చారు. ఇక, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇచ్చిన వివరణలు, వ్యాఖ్యలు గతంలో చేసినవే. హింస ఆగాలనీ, దౌత్యానికి మద్దతిస్తామనీ, అవసరమైతే మధ్యవర్తిగా ఉంటామనీ మరోమారు ఉద్ఘాటించారు జయశంకర్. ఇక, రష్యాతో ఆయుధ ఒప్పందాలకు దూరంగా ఉండాలన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ సూచనకు కానీ, భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనలను నిశితంగా గమనిస్తున్నామన్న హెచ్చరికకు కానీ స్పందించాల్సిన అవసరం లేదని భారత్ నిర్ణయించుకుంది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య విషయంలో భారతదేశ తటస్థ వైఖరిపై అమెరికా ఆచితూచి స్పందిస్తోంది. భారత్ మీతోనే ఉంటుందా? అని విలేఖరులు వేసిన ప్రశ్నకు బైడెన్ జాగ్రత్తగా సమాధానం చెప్పారు. భారతదేశం బుచా ఊచకోతల తర్వాత రష్యాకు వ్యతిరేకంగా బలంగా నిలబడిందని, ఉక్రెయిన్‌కు సాయం చేస్తోందనీ అమెరికా అధికారులే గుర్తుచేస్తున్నారు. చమురు కొనుగోళ్ళను పెంచబోమన్న హామీ ఏమైనా భారత్ నుంచి సాధించారా? అన్న విలేఖరులు ప్రశ్నకు వైట్ హౌస్ సెక్రటరీ ఆ విషయాన్ని మోడీ చూసుకుంటారనీ, రష్యా నుంచి ఇండియా కొంటున్నది తన చమురు అవసరాల్లో రెండు శాతం మాత్రమేననీ, అమెరికా నుంచి పదిశాతం కొంటున్నదని చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News