దొంగతనం చేసాడని..మెడలో చెప్పులు వేసి ఊరేగింపు

Viral Video: కొన్నిసార్లు మను చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూస్తే మనం ఎక్కడున్నామో మనకే అర్దం కాదు.

Update: 2025-06-25 06:34 GMT

దొంగతనం చేసాడని..మెడలో చెప్పులు వేసి ఊరేగింపు

Viral Video: కొన్నిసార్లు మను చుట్టూ జరుగుతున్న సంఘటనలను చూస్తే మనం ఎక్కడున్నామో మనకే అర్దం కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పే పోలీసులే నిత్యం చట్టాన్ని చుట్టంగా మలుచుకుంటూనే ఉంటారు. నేరాలకు వారే శిక్షలు వేసేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన జమ్ముకశ్మీర్‌‌లో ఇటీవల జరిగింది. ఒక రోగి కోసం మందులు కొంటున్న వ్యక్తి దగ్గర నుంచి నిందితుడు వేల రూపాయలు దొంగతనం చేసిన ఘటనతో పోలీసులు అతని మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నిందితుడు కొన్ని రోజుల క్రితం ఒక రోగి కోసం మందులు కొనుగోలు చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి రూ.40వేల రూపాయలు దొంగతనం చేసి, పారిపోయాడు. తాజాగా నిందితుడ్ని ఓ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండడాన్ని బాధితుడు చూసి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. అంతలోనే నిందితుడ్ని పట్టుకోవాలని చూడడంతో అతను బాధితుడిపై కత్తితో దాడి చేశాడు. ఈక్రమంలో నిందితుడికి గాయాలయ్యాయి. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. వేలల్లో డబ్బును దోచాడన్న కారణంతో అతనికి దేహశుద్ది చేశారు. ఆ తర్వాత అతని చేతులు కట్టేసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది.

అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్రజలకు చెప్పాల్సింది పోయి పోలీసులే ఇలా శిక్షలు వేయడానికి తీవ్రంగా ఖండించింది. పైగా ప్రజల సమక్షంలో ఒక వ్యక్తిని ఇలా చెప్పుల దండ వేసి అవమానించడం కరెక్ట్ కాదని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీనిపై సీనియర్ పోలీసు అధికారులు స్పందించి, కేసుపై విచారణ చేపట్టారు.

Tags:    

Similar News