రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. జైపూర్‌లో వాహనాలపైకి దూసుకెళ్లిన డంపర్‌ ట్రక్కు

రాజస్థాన్‌లో మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జైపూర్‌లో వాహనాలపైకి ఓ డంపర్‌ ట్రక్కు దూసుకెళ్లింది.

Update: 2025-11-03 10:53 GMT

రాజస్థాన్‌లో మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జైపూర్‌లో వాహనాలపైకి ఓ డంపర్‌ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 10 మందికిపైగా మృతి చెందారు. మరో 18 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

హర్మదలోని సికర్‌ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై రాజస్థాన్‌ సీఎం బజన్‌లాల్‌ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

Tags:    

Similar News