ప్రయోగాల పరంపరకు ఇస్రో సన్నాహాలు

* పీఎస్‌ఎల్వీ నుంచి విశ్వ శోధనకు సన్నద్ధం * ఈనెల 28న నింగిలోకి పీఎస్ఎల్‌వీ-సి51ని రాకెట్ ఒకేసారి * కక్ష్యలోకి నాలుగు ఉపగ్రహాలు పంపేందుకు ఏర్పాట్లు

Update: 2021-02-07 02:19 GMT

Representational Image

ప్రయోగాల పరంపరకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇస్రోకు అచ్చొచ్చిన వాహకనౌక పీఎస్ఎల్వీ నుంచి విశ్వ శోధనకు సన్నద్ధమైంది. ఈనెల 28న నింగిలోకి పీఎస్ఎల్వీ -సీ51ని రాకెట్‌ను ప్రయోగించనుంది. ఒకేసారి కక్ష్యలోకి నాలుగు ఉపగ్రహాలు పంపేందుకు చకచక ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 28న ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక -సీ51 ను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా 1తోపాటు దేశానికి చెందిన ఆనంద్, సతీశ్ ధవన్ ఉపగ్రహాలతోపాటు యూనిటీశాట్ ఇందులో పంపనున్నారు. ఆనంద్ ఉపగ్రహాన్ని ఇండియన్ స్పేస్ స్టార్టప్ పిక్సెల్, సతీశ్ ధవన్ శాటిలైట్ ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా రూప కల్పన చేసింది. పీఎస్ ఎల్వీ-సి51 ద్వారా దేశంలోని మొట్టమొదటి ద్వారా వాణిజ్య ప్రైవేటు రిమోట్ సెన్సింగ్ ఉప గ్రహంను నింగిలోకి పంపుతున్నారు.

Full View


Tags:    

Similar News