Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ యోజనలో మీ పేరుందా.. ఈజీగా చెక్క చేసుకోండిలా.. ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా..!
Ayushman Bharat Yojana List: దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పథకాలను అందజేస్తూనే ఉంది. ఆ పథకాల్లో ఒకదాని పేరు ఆయుష్మాన్ భారత్ యోజన. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కార్డ్ పథకం.
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ యోజనలో మీ పేరుందా.. ఈజీగా చెక్క చేసుకోండిలా.. ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా..
Ayushman Bharat Yojana: దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పథకాలను అందజేస్తూనే ఉంది. ఆ పథకాల్లో ఒకదాని పేరు ఆయుష్మాన్ భారత్ యోజన. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కార్డ్ పథకం. దీని ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మందికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలు లభిస్తున్నాయి. ఈ కార్డు ద్వారా లబ్ధిదారులు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.
ఈ పథకం ప్రయోజనం ఎవరికి లభిస్తుంది?
పేద, కార్మికుడు, గిరిజన, నిరాశ్రయులు, నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు స్కీమ్ కోసం మీరే రిజిస్టర్ చేసుకుని, ఆయుష్మాన్ భారత్ యోజన జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవాలనుకుంటే, సులభమైన మార్గాన్ని తెలియజేస్తున్నాం.
ఆయుష్మాన్ భారత్ పథకం జాబితాలో పేరును తనిఖీ చేయడానికి సులభమైన మార్గం-
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లిస్ట్‌లో మీ పేరును చెక్ చేసుకోవడానికి, ముందుగా pmjay.gov.inని సందర్శించండి.
ఆ తర్వాత, మీరు పైన ఉన్న కేటగిరీని ఎంపిక చేసుకోవాలి.
దీని తర్వాత ఇక్కడ మీరు పోర్టల్ ఎంపికలో ఆయుష్మాన్ మిత్ర ఎంపికను చేసుకోవాలి.
దానిపై క్లిక్ చేసిన తర్వాత, డౌన్‌లోడ్ జాబితాను చూడొచ్చు.
ఈ జాబితాపై క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ మొబైల్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయాలి.
దీని తర్వాత ఒక పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు మీ రాష్ట్రం, జిల్లా పేరు, బ్లాక్ రకాన్ని ఎంచుకోవాలి.
మీరు ఏ గ్రామానికి చెందిన వారైతే, మీరు ఆ బ్లాక్‌ను ఎంపికను ఎంచుకోవాలి. ఇందులో నగర ప్రజలు ULB ఎంపికను ఎంచుకోవాలి.
ఆ తర్వాత, మీ ప్రాంతంలోని ఆయుష్మాన్ భారత్ యోజన లబ్ధిదారులందరి జాబితా మీ ముందు ఓపెన్ అవుతుంది.
ఇందులో మీరు మీ పేరును చెక్ చేసుకోవచ్చు.