ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం

* ఇజ్రాయెల్‌ ఎంబసీ టార్గెట్‌గా పేలుళ్లు * ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు * పేలుడు ప్రదేశాన్ని 3డీ మ్యాపింగ్‌ చేసిన ఎన్‌ఎస్‌జీ

Update: 2021-01-31 04:10 GMT

Delhi blast Investigation

ఢిల్లీలో పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. అదేవిధంగా ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న 30మంది ఇరాన్‌ జాతీయులను ప్రశ్నిస్తున్నారు. పేలుడు ప్రదేశాన్ని 3డీ మ్యాపింగ్‌ చేయగా ఘటన పరిసరాల్లో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, ఎన్‌ఎస్‌జీ దర్యాప్తును ప్రారంభించింది.

పేలుడుకు ముందు నిందితులు రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. స్పాట్‌లో పేలుడుకు ఉపయోగించిన బ్యాటరీని దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్‌ ఎంబసీ టార్గెట్‌గా పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఇక పేలుళ్ల సమయంలో ఓ క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు దిగినట్లుగా గుర్తించారు.

ఇదిలా ఉంటే శనివారం ఢిల్లీ పోలీసులకు ఫోన్‌ చేసిన అజ్ఞాత వ్యక్తిని క్యాబ్‌ డ్రైవర్‌గా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తన క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించినట్లు తెలిపాడు డ్రైవర్‌.

Tags:    

Similar News