Terror Attack in Ayodhya: అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్‌‌ పన్నాగం.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్..

Update: 2020-07-29 09:28 GMT

Terror Attack in Ayodhya: పాకిస్తాన్ గూడచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆగస్టు 15 న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామ్ జన్మభూమిపై ఉగ్రవాద దాడి చేయాలని ప్రణాళిక రచించినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి. ఐఎస్ఐ ఈ దాడి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్లోని లష్కర్ మరియు జైష్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆర్‌అండ్‌డబ్ల్యూ ప్రకారం, ఈ దాడి కోసం అయోధ్యలో మూడు నుంచి ఐదు గ్రూపుల ఉగ్రవాదులను పంపాలని ఐఎస్‌ఐ యోచిస్తోంది. ఉగ్రవాద సంస్థలు వేర్వేరుగా దాడులు చేయాలని పాకిస్తాన్ కోరుకుంటుందని, దీనిని భారతదేశంలో అంతర్గత దాడిగా సృష్టించాలని పాక్ అనుకుంటున్నట్టు భారత ఇంటలిజెన్స్ సంస్థ వెల్లడించింది.

వివిఐపిలు కూడా పాక్ ఏజెన్సీ యొక్క హిట్-లిస్టులో ఉన్నారు.. కాబట్టి దాడి ప్రభావం చాలా వరకూ ఉండవచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. 20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్‌ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయోధ్యతోపాటు కశ్మీర్‌లోనూ దాడులు చేసేందుకు పాకిస్తాన్‌లోని జలాల్‌బాద్‌లో ఐఎస్‌ఐ వారికి శిక్షణ ఇచ్చిందని తెలిపింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5 న అయోధ్యలోని రామ్ ఆలయానికి పునాది రాయి వేయనున్నారు.   

Tags:    

Similar News