INS Airavat: సింగపూర్ నుండి ప్రాణవాయువును మోసుకొచ్చిన ఐఎన్ఎస్ ఐరావత్

INS Airavat: అగ్రరాజ్యం అమెరికా నుంచి సింగపూర్ వరకు కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తున్నాయి.

Update: 2021-05-11 05:31 GMT
ఐయెన్ఎస్ ఐరావత్ (ఫైఇమాజ్)

INS Airavat: రోజు రోజుకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి భారత దేశాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడగా, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరో వైపు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో కరోనా బాధితులు అల్లాడి పోతున్నారు. 37 లక్షలకు పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లందరికీ ఒకేసారి వైద్య సదుపాయాన్ని కల్పించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్న ఆసుపత్రులు చాలట్లేదు. ఆక్సిజన్ అందట్లేదు. ఆసుపత్రుల్లో పడకలు కొరత వెంటాడుతోంది. చాలినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేవు.

ఫలితంగా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.ఇండియాలో నెలకొన్న పరిస్థితులను చూసి ప్రపంచ దేశాల చలించిపోతూ సహాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి సింగపూర్ వరకు కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ ఎనిమిది క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, జనరేటర్లు, వెంటిలేటర్లను భారత్‌కు పంపించింది. నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ వాటిని మోసుకుని విశాఖపట్నం నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ మధ్యాహ్నం ఐఎన్ఎస్ ఐరావత్ నౌక విశాఖ పోర్ట్‌లో లంగరు వేసింది.

ఎనిమిది 20 టీ క్రయోజనిక్ ట్యాంకులు, 3,150 ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణవాయులు నింపిన మరో 500 సిలిండర్లు, ఏడు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను మోసుకొచ్చిందా నౌక. 10,000 యాంటీజెన్ టెస్ట్ కిట్లను కూడా పంపించింది సింగపూర్. 450 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ (పీపీఈ) కిట్లను సైతం భారత్‌కు అందజేసింది. ఇదివరకు సింగపూర్ మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లను పంపించింది. వాటిని ఐఎల్-76 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో వైమానిక దళానికి చెందిన పానాగఢ్ ఎయిర్ బేస్ స్టేషన్‌లో ఆ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. 

Tags:    

Similar News