షీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

Indrani Mukerjea: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి విడుదలయ్యారు.

Update: 2022-05-20 15:30 GMT

షీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

Indrani Mukerjea: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని బైకులా జైలు నుంచి ఆరున్నర సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. సుప్రీం కోర్టు రెండు రోజుల కిందట ఇంద్రాణికి బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలవడం తనకు సంతోషంగా ఉందని ఇంద్రాణి చెప్పింది. 2012 ఏప్రిల్ లో 24 ఏళ్ల షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జీ, తన అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాలతో కలిసి కారులో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవిలో ఆమె మృతదేహాన్ని కాల్చివేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలన సృష్టించింది.

Tags:    

Similar News