Indigo: ఇండిగో సంక్షోభం.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల పరిహారం
Indigo: ఇటీవల ఇండిగో (Indigo) విమానయాన సంస్థ సేవల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయంపై ప్రయాణికులకు ఊరట లభించింది.
Indigo: ఇండిగో సంక్షోభం.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల పరిహారం
Indigo: ఇటీవల ఇండిగో (Indigo) విమానయాన సంస్థ సేవల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయంపై ప్రయాణికులకు ఊరట లభించింది. విమానాల రద్దు, భారీ ఆలస్యం కారణంగా డిసెంబరు 3, 4, 5 తేదీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు రూ.10,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని ఇండిగో సంస్థ తాజాగా ప్రకటించింది.
డిసెంబరు మొదటి వారంలో సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల ఇండిగో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం జరిగింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో, డిసెంబరు 3, 4, 5 తేదీల్లో తమ సేవల్లో తీవ్ర అంతరాయం కారణంగా ప్రయాణాన్ని కోల్పోయి లేదా ఆలస్యాన్ని ఎదుర్కొని తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు నష్టపరిహారంగా ఈ మొత్తాన్ని చెల్లించడానికి ఇండిగో అంగీకరించింది. ఈ పరిహారం ప్రయాణికులకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని అందించనుంది.