Indigo Crisis Continues: ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం.. వరుసగా ఏడోరోజు రద్దైన విమానాలు
Indigo Crisis Continues: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజు విమానాలు రద్దయ్యాయి.
Indigo Crisis Continues: ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం.. వరుసగా ఏడోరోజు రద్దైన విమానాలు
Indigo Crisis Continues: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజు విమానాలు రద్దయ్యాయి. ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్‌కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా.. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు విశాఖ నుంచి 7 ఫ్లైట్లను ఇండిగో క్యాన్సిల్ చేసింది. వీటిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి రాకపోకలు సాగించే 18 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇవాళ కూడా ఇండిగో విమానాలు లేటుగా నడిచే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటివరకు మొత్తం 134 ఫ్లైట్లను ఇండిగో క్యాన్సిల్ చేసింది.