Bharat Biotech Vaccine: భారత్‌ బయోటెక్ నాస‌ల్ కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమ‌తి

Bharat Biotech Vaccine: భారత్‌ బయోటెక్ తయారు చేసిన...ఇంట్రా నాస‌ల్ కోవిడ్19 టీకాకు డీసీజీఐ అనుమ‌తి

Update: 2022-09-06 12:24 GMT

Bharat Biotech Vaccine: భారత్‌ బయోటెక్ నాస‌ల్ కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమ‌తి

Bharat Biotech Vaccine: భారత్‌ బయోటెక్ తయారు చేసిన నాసల్‌ వ్యాక్సిన్‌ DCGI అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎమ‌ర్జెన్సీగా వాడేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇంట్రానాస‌ల్ కోవిడ్19 టీకాకు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాకు అనుమ‌తి ద‌క్క‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా అందుబాటులో ఉంది. కోవిడ్‌పై పోరాటంలో భారత్ ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కోసం బూస్టర్ డోస్‌గా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి DCGI గతంలో అనుమతిని ఇచ్చింది. BBV-154 (ఇంట్రానాసల్) ఇమ్యునోజెనిసిటీ, భద్రతను కోవాక్సిన్‌తో పోల్చడానికి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి డ్రగ్ రెగ్యులేటర్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గతవారం, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్‎ని సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ట్రయల్స్ తర్వాత ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదని.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని కంపెనీ తెలిపింది.

Tags:    

Similar News