Coronavirus గురించి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు : WHO

Update: 2020-03-05 05:32 GMT

కరోనావైరస్(కోవిడ్ -19) వ్యాప్తి గురించి భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. భారత్ లో కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రోడ్రికో ఆఫ్రిన్ మాట్లాడుతూ.. కరోనాపై భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని, భారతదేశంలో పాజిటివ్‌గా పరీక్షించిన కేసులు అన్ని కూడా విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్లే వచ్చాయని.. భారత్ లో వైరస్ ఉద్భవించలేదని వ్యాఖ్యానించారు.

అంతేకాదు భారత్ లో వైరస్ భారిన పడిన వారికి చికిత్స చేయడానికి ఒక గంట.. ఎక్కువ శిక్షణ పొందిన వైద్యులు మరియు నర్సులు ఉంటే సరిపోతుందన్నారు.. ఇప్పటికే భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేంద్రాలు ఉన్నాయని, అదే విధంగా ఆసుపత్రులలో ఐసోలేషన్ వార్డులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ వైరస్ తగ్గుతుందా అనే దాని గురించి మాట్లాడుతూ, " దీనిపై ఇంకా మాకు సమాచారం లేదు.. పరిశోధన ఇంకా అదే విధంగా జరుగుతోంది. ఇది కొత్త వైరస్ కాబట్టి దానిపై సమాచారాన్ని సేకరించడానికి కొంత సమయం పడుతుంది. దానిపై 24x7 పరిశోధనలు జరుగుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నిపుణులు దాని పరిణామాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. " అని అన్నారు.

అలాగే ముందు జాగ్రత్తగా పౌరులు ఏమి చెయ్యాలన్న విషయాన్నీ గురించి మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరు తమ చేతులను తరచుగా కడుక్కోవడం, తుమ్ముతున్నప్పుడు నోటికి కర్చీఫ్ అడ్డుపెట్టుకోవడం వంటి ప్రాథమిక పరిశుభ్రతను పాటిస్తూ.. జనసమూహం ఉన్న చోట ఎక్కువగా తిరగక పోవడం ఒకవేళ దగ్గు, తుమ్ములు, జ్వరం వంటివి వస్తే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

ఏదేమైనా, వృద్ధులను మరియు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు.. వీరికే వైరస్ ఎక్కువగా సోకె అవకాశం ఉందని చెప్పారు. తద్వారా వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదని సూచించారు. కాగా భారత్ లో ఇప్పటికే 28 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వారిలో 14 మంది ఇటాలియన్ పర్యాటకులు ఉన్నారు. ప్రస్తుతం వైరస్ సోకినా వారంతా ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News