Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఖలాసీ వ్యవస్థకు పుల్‌స్టాప్‌

Update: 2020-08-07 09:37 GMT

Indian Railways: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలుకుతూ భారత రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వేకు చెందిన సీనియర్‌ అధికారుల ఇళ్లలో పనిచేసే ప్యూన్‌లనే ఖలాసీలుగా పిలుస్తారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

దీంతోపాటు టెలిఫోన్ అటెండెంట్ క‌మ్ డాక్ క‌లాసీ (టీఏడీకే) వ్య‌వ‌స్థ‌ ర‌ద్దు అంశాన్నిప‌రిశీలిస్తున్నామ‌ని రైల్వేబోర్డు తెలిపింది. దీంతో ఈ పోస్టులకు సంబంధించి కొత్త‌ నియామ‌కాలు చేపట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొంది. గ‌త జూలై నుంచి ఆమోదం పొందిన ఇలాంటి పోస్టుల‌ను పునఃస‌మీక్షించాల‌ని, రైల్వేలోని అన్ని సంస్థ‌లు దీన్ని క‌చ్చితంగా అమ‌లుచేయాల‌ని ఉత్త‌ర్వులు జారీచేసింది. ఇక వివిధ విభాగాల్లో కాలానుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టిన రైల్వే శాఖ.. ఇప్పటికే డాక్‌ మెసేంజర్‌ వ్యవస్థకు చరమగీతం పాడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News