రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఆ పనులన్ని ఇక్కడే కంప్లీట్‌..!

Indian Railway: మీరు రైలులో ప్రయాణించాలంటే ఒక్కోసారి ముందుగానే టిక్కెట్లు బుక్‌ చేసుకుంటారు.

Update: 2022-03-06 12:00 GMT

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఆ పనులన్ని ఇక్కడే కంప్లీట్‌..!

Indian Railway: మీరు రైలులో ప్రయాణించాలంటే ఒక్కోసారి ముందుగానే టిక్కెట్లు బుక్‌ చేసుకుంటారు. అయితే ఇప్పుడు దేశంలోని రైల్వే స్టేషన్లలో విమాన టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు పాన్‌, ఆధార్‌ కార్డుల తయారీ కూడా స్టేషన్‌ ఆవరణలోనే జరగనుంది. ఇది మాత్రమే కాదు మీరు ఇక్కడ నుంచి ఆదాయపు పన్ను రిటర్న్‌ను కూడా ఫైల్ చేయవచ్చు. అవును.. మీరు విన్నది నిజమే.. ఇప్పుడు దేశంలోని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్‌లకు వెళ్లే ప్రయాణికులు ఇతర ముఖ్యమైన సౌకర్యాలను కూడా పొందగలుగుతారు. రైల్వే యంత్రాంగం ప్రయాణికుల సౌకర్యాలపై నిరంతరం శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో రైల్‌టెల్ అనే రైల్వే సంస్థ ఇప్పుడు స్టేషన్‌లలో రైల్‌వైర్ సాథీ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

రైల్‌టెల్ ఓపెన్‌ చేసే కియోస్క్ ద్వారా ప్రయాణికులు రైలు టిక్కెట్‌లతో పాటు విమాన టిక్కెట్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఝాన్సీలోని వీరాంగన లక్ష్మీబాయి స్టేషన్‌లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్లలోని కియోస్క్‌లలో మరిన్ని సౌకర్యాలను ప్రారంభించనున్నారు. పైన పేర్కొన్న సౌకర్యాలను అందించే కియోస్క్‌లు ఇప్పటికే వారణాసి, ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లలో ప్రారంభమయ్యాయి. రానున్న కాలంలో ఈశాన్య రైల్వేలోని 200 స్టేషన్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. రైల్వే యంత్రాంగం ప్రయాణికుల సౌకర్యాన్ని నిరంతరం ప్రోత్సహిస్తోందని రైల్వే అధికారులు తెలిపారు.

ఇటీవల రైల్వే IRCTC డిజిటల్ చెల్లింపు ప్రదాత Paytmతో కలిసి డిజిటల్ టికెటింగ్‌ను సులభతరం చేసింది. ప్రయాణీకులు ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయగలరు. రైల్వే ప్రయాణీకులలో నగదు రహితాన్ని ప్రోత్సహించడానికి ATVMలలో UPI ద్వారా టికెట్ సేవలకు డిజిటల్‌గా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. భారతదేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ATVM మెషీన్లు ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News