భారత్ మరో విజయం తన స్వంతం చేసుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఎన్నికల్లో నాన్ పర్మినెంట్ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ వేడుకలు ఈ అద్బుత విజయానికి వేదికయ్యాయి.
2021-22 సంవత్సరానికి గానూ ఐరాస భద్రతా మండలిలో ఆసియా-పసిఫిక్ రీజన్ నుంచి భారత్ నాన్ పర్మినెంట్ సభ్యునిగా మరోసారి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. "ఐక్యరాజ్యసమితి తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ విజయం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అటు ప్రపంచదేశాలు కూడా మెల్లిమెల్లిగా కోవిడ్ 19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని కూడా చెప్పాలి.
కాగా, బుధవారం ఐరాస భద్రతా మండలిలోని ఐదు నాన్ పర్మినెంట్ సభ్యత్వ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఐరాస భద్రతా మండలిలో 15 శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ రీజన్‌లో చైనా, పాకిస్తాన్‌తో పాటు 55 సభ్య దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత్‌కు గతేడాది జూన్‌లోనే మద్దతు తెలపడంతో ఇప్పుడు ఏకగ్రీవంగా గెలుపొందింది.