మహాత్మాగాంధీ జీవితం ఎందరినో ప్రభావితం చేసింది.. ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ అద్భుత ప్రసంగం

మహాత్మాగాంధీ జీవితం ఎందరినో ప్రభావితం చేసింది.. ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ అద్భుత ప్రసంగం
x
Highlights

జాతిపిత మహాత్మా గాంధి 150 వ జయంతి పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ గాంధీ జీవితంపై అద్భుత ప్రసంగాన్ని చేశారు.

మహాత్మా గాంధీతో పరిచయం లేనివారు కూడా అయన జీవితంతో ప్రభావితమయ్యారు. నెల్సన్ మండేలా వంటి వారి జీవితం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతిపిత గాంధీ గురించి అద్భుత ప్రసంగం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి లో బుధవారం మహాత్మాగాంధీ 150 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యెక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మహాత్మునికి ఘన నివాళి అర్పించారు. ఇదే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా రూపొందించిన మహాత్మా గాంధీ స్టాంపును దేశాధినేతల సమక్షంలో మోడీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

"గాంధీ భారతీయుడైనప్పటికీ.. ఆయన సిద్ధాంతాలు మాత్రం కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ వేడుకే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్య వ్యవస్థ నిజమైన సత్తా ఏమిటో గాంధీ ఆనాడే చెప్పారు. ప్రజలు పాలకులపై కాకుండా తమపై తాము ఎలా ఆధారపడాలో గాంధీ మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా సమాజం ఎలా ముందుకు వెళ్లాలో పథనిర్దేశం చేశారు. ఈ విధానాలే నేడు భారత్‌ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం చూపుతోంది. ప్రజల అంతర్గత శక్తిని మేల్కొలిపి, మార్పు తీసుకురావడానికి గాంధీ ప్రయత్నించారు. "ఇతరుల్ని ఎలా ఆకట్బకోవాలో అనే యుగంలో మనం జీవిస్తున్నాం, కానీ, గాంధీ మాత్రం "ఇతరుల్ని ఎలా ప్రేరేపించాలో' నేర్పారు. "కృషి లేని సంపద, 'స్పృహ లేని ఆనందం', 'గుణం లేని జ్ఞానం', 'విలువల్లేని వ్యాపారం, "మానవత్వం లేని శాస్త్రవిజ్ఞానం'. 'త్యాగం లేని మతం' ఈ ఏడు సూత్రాల నుంచి మనిషి దృష్టి మరల్చోద్ధని గాంధీ సూవించారు. వాతావరణ మార్పులు. ఉగ్రవాదం, అవినీతి ఇలాంటి రుగ్మతల నుంచి మానవాళిని రక్షించుకోవడానికి ఈ ఏడు సూత్రాలు నేటికీ ఆచరణీయమే. మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో గాంధీ చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ గాంధీ సిద్ధాంతాల్ని, సమకాలీన ప్రపంచంలో వాటి జెచిత్యాన్ని మోడీ స్పష్టంగా వివరించారు.

ఈ సందర్భంగా ఐరాసలో భారత్‌ నెలకొల్పిన ప్రత్యేక సోలార్‌ ప్లాంట్‌ను మోదీ దేశాధినేతల సమక్షంలో స్రారంభించారు.. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరన్‌తో పాటు, సింగపూర్‌, భూటాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, జమైకా న్యూజిలాండ్‌ సహా పలువురు ఇతర దేశాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories