Today Corona Cases in India: ఇండియాలో కొనసాగుతోన్న మృత్యుఘోష

Today Corona Cases in India: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,60,960 కరోనా కేసులు నమోదు కాగా, 3,293 మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2021-04-29 03:25 GMT

Today Corona Cases in India: (File Image) 

Today Corona Cases in India: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,60,960 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,293 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం కూడా రికార్డు స్థాయిని దాటి కేసులు, మరణాలు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 3,79,164 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 3,646 మంది బాధితులు కరోనా కారణంగా మరణించారు. దేశంలో కరోనా విజృంభణ మొదలైన నాటినుంచి.. ఇన్ని కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. అయితే మే ప్రారంభానికి ముందే ఇన్ని కేసులు, మరణాలు నమోదవుతుండటంతో అంతటా భయాందళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.

కాగా.. నిన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మంగళవారం నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో గరిష్ఠంగా 895 మంది, ఢిల్లీలో 381, ఉత్తరప్రదేశ్‌లో 264, ఛత్తీస్‌గఢ్‌లో 246, కర్ణాటక 180, గుజరాత్‌ 170, ఝార్ఖండ్‌ 131, రాజస్థాన్‌లో 121, పంజాబ్‌లో 100 మంది మృతి చెందారు. దీంతోపాటు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర.. ఆతర్వాత ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది.

Tags:    

Similar News