India Corona Updates:కొనసాగుతున్న కరోనా ఉధృతి..24 గంటల్లో4,077 మంది మృతి
India Corona Updates: కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణా సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
India Corona Updates:(File Image)
India Corona Updates: భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణా సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. నిన్న కొత్తగా 3,11,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,62,437 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 4,077 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,70,284కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,07,95,335 మంది కోలుకున్నారు. 36,18,458 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు వేశారు. నమోదు అవుతున్న కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశమే.