భారత్‌లో 24 గంటల్లో 13వేలకు పైగా కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన కేంద్రం

Lav Agarwal: దేశవ్యాప్తంగా కరోనాతో పాటు ఒమిక్రాన్ దడ పట్టిస్తోంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.

Update: 2021-12-30 13:08 GMT

భారత్‌లో 24 గంటల్లో 13వేలకు పైగా కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన కేంద్రం

Lav Agarwal: దేశవ్యాప్తంగా కరోనాతో పాటు ఒమిక్రాన్ దడ పట్టిస్తోంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి చేరింది. వీరిలో 320 మంది రికవరీ అయ్యారు. అత్యధికంగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. రెండు నుండి మూడు రోజుల్లో ఒమిక్రాన్ కేసులు రెట్టింపు అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

మరోవైపు కరోనా కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో 13 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. 33 రోజుల తరువాత అత్యధిక కేసులు నమోదయ్యాయని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్నాటక, గుజరాత్ రాష్ర్టాల్లో ఎక్కువ కేసులు వస్తున్నట్లు వెల్లడించారు. కొల్‌కతాతో పాజిటివ్ రేటు 12.5 శాతంగా ఉందన్నారు. 14 జిల్లాల్లో పాజిటివీ రేటు 5 నుండి 10 శాతం మధ్య ఉందన్నారు.

Tags:    

Similar News