New York Times: అదంతా ట్రాష్‌.. అమెరికా మీడియాకు ఇచ్చిపడేసిన ఇండియా!

New York Times: HALపై వచ్చిన రష్యా సంబంధిత ఆరోపణలు అవాస్తవమని భారత్ స్పష్టం చేసింది.

Update: 2025-04-01 02:30 GMT

New York Times: అదంతా ట్రాష్‌.. అమెరికా మీడియాకు ఇచ్చిపడేసిన ఇండియా!

New York Times

భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రష్యాకు సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం సరఫరా చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని భారత విదేశాంగ శాఖ పూర్తిగా ఖండించింది. ఈ కథనంలో వచ్చిన ఆరోపణలు అవాస్తవకమైనవని, అర్థం తప్పుగా ప్రజలకు తెలియజేసేలా రూపొందించబడినవని స్పష్టం చేసింది.

HAL సంస్థ అంతర్జాతీయ వ్యాపార నియమాలు, వ్యూహాత్మక వ్యాపార నియంత్రణలపై ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలన్నింటిని గౌరవించిందని తెలిపింది. రష్యా యొక్క ఆయుధ ఉత్పత్తుల ఏజెన్సీ అయిన రోసోబోరోనెక్స్‌పోర్ట్‌కు HAL సంబంధిత భాగస్వామిగా వ్యవహరించిందన్న విషయాన్ని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది.

బ్రిటిష్‌కి చెందిన ఏరోస్పేస్ సంస్థ HR స్మిత్ గ్రూప్ నుండి 2023–2024 మధ్య కాలంలో కొన్ని రిజర్వ్‌డ్ పరికరాలు భారత కంపెనీకి వెళ్లినట్లు కథనంలో పేర్కొన్నప్పటికీ, అవి రష్యాకు వెళ్లాయనే నిర్ధారణ మాత్రం అందుబాటులో లేదు. ఆ పరికరాలు ముందుగా దక్కిన కోడ్‌ నంబర్లతోనే రష్యాకు చేరినట్టు తాము తెలుసుకున్నామని కథనంలో పేర్కొన్నా, వాటికి సరైన లింక్ కనుగొనలేకపోయారు. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు న్యూస్ మీడియా నిర్దిష్టంగా పరిశీలన చేయాలని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. దేశీయ కంపెనీల వాణిజ్య కార్యకలాపాలు, అంతర్జాతీయ వ్యాపార నియమాలకు అనుగుణంగా జరిగేలా భారత ప్రభుత్వం కల్పించిన చట్టపరమైన, నియంత్రణా వ్యవస్థ చాలా బలంగా ఉందని స్పష్టం చేసింది.

Tags:    

Similar News