India Missile: భారత్‌ చేతిలో నాగాస్త్రాం.. దెబ్బకు వణకిపోతున్న శత్రు దేశాలు!

India Missile: ఇది ఓ మార్పు కాదు, ఇది రణరంగాన్ని మార్చే విప్లవం. భారత్ ఇప్పుడు ఆయుధ సామర్థ్యం పరంగా తనకు తానే నిలబడుతోంది.

Update: 2025-04-06 03:00 GMT

India Missile: భారత్‌ చేతిలో నాగాస్త్రాం.. దెబ్బకు వణకిపోతున్న శత్రు దేశాలు!

India Missile Nagastram DRDO explainer

India Missile: భారత భూమిపై త్రివర్ణ పతాకం ఎగిరితే.. శత్రువు గుండెల్లో భయం పెరిగే రోజులు వచ్చేశాయి. దేశం మారుతోంది. విదేశీ ఆయుధాలపై ఆధారాన్ని తగ్గిస్తూ... భారత సైన్యం ఇప్పుడు తానే తయారుచేసిన ఆయుధాలతో ముందుకు సాగుతోంది. ఇదిగో అందుకు అద్దంపట్టే ఉదాహరణగా నిలుస్తోంది..నాగ్ మిసైల్ సిస్టమ్.

ఇది అంత తక్కువ మోడల్ కాదు. దీన్ని దేశీయంగా డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. ఇది మొదటి తరం కాదు, రెండవ తరం కూడా కాదు. ఇది మూడవ తరం మిసైల్. అంటే ‘ఫైర్ అండ్ ఫర్గెట్’ టెక్నాలజీ. లక్ష్యాన్ని చూస్తుంది, టార్గెట్ ఫిక్స్ చేస్తుంది.. తర్వాత అది ఎక్కడున్నా వెళ్లి పేలుతుంది. మిగతా పని మొత్తం మిసైల్ దే.

నాగ్ మిసైల్ ప్రత్యేకతలు ప్రపంచ స్థాయిలో యుద్ధ భూముల్లో ఇది అత్యంత విలువైన ఆయుధంగా నిలవడానికి కారణం అయ్యాయి. ఎలాంటి ట్యాంక్ అయినా ఉండకూడదు అన్నట్టు దాని లక్ష్యాన్ని పొట్టన పెట్టేస్తుంది. శత్రువి ట్యాంక్ ఎలాంటి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నా – ఎక్స్‌ప్లోసివ్ రియాక్టివ్ ఆర్మర్ అయినా సరే నాగ్ దాన్ని ఛేదిస్తుంది. ఇది ట్రాక్డ్ వెహికల్స్ మీద మౌంట్ చేసి తీసుకెళ్లేలా డిజైన్ చేశారు. అంటే సైన్యం ఎక్కడికైనా వెళ్తే.. ఇది కూడా వెంటనే చేరిపోతుంది. హిమాలయాల్లో ఉన్న హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలైనా, మంచుతో నిండిన సెక్శన్లైనా, ఎండ వేడితో కట్టిపడేసిన ఎర్రటి ఎడారులైనా, నాగ్ పనితీరులో జాప్యం ఉండదు. ఒకవైపు కనిపిస్తూ, మరోవైపు మృతశత్రువుల్ని ఛేదించే సామర్థ్యం దీనికుంది. శత్రువు దాగిన చోటైనా ఇది జాగ్రత్తగా గమనించి మరణ హేతువు అవుతుంది.

చైనా సరిహద్దుల్లో తరచూ ఆర్మీతో ఆటలాడే పరిస్థితులు మనం చూశాం. కానీ ఇప్పుడు నాగ్ ఉన్న చోట.. డ్రాగన్ దూకుడు ఆగాల్సిందే. ఇది కనిపించకుండా ప్రయాణిస్తూ శత్రు దేశంలోనూ చొచ్చుకుపోతుంది. లడఖ్ సరిహద్దుల్లోకి చైనా రెగ్యులర్ గా దూసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, ఈ మిసైల్ వాటిని సమర్థంగా ఎదుర్కొనగలదు. అలాగే, పాకిస్తాన్ తరచూ తన ట్యాంకులతో ఇండియా గడపదాటే ప్రయత్నం చేస్తుంటే, ఈ మిసైల్ వాటిని వెంటనే నాశనం చేయగల సామర్థ్యంతో ఉంది.

ఈ మార్పు కేవలం డిఫెన్స్ విభాగానికి పరిమితమై ఉండదు. వేలాది మంది ఇంజనీర్లు, వందలాది కంపెనీలు... చిన్నా పెద్దా పరిశ్రమలన్నీ దీనికి భాగస్వాములయ్యాయి. ఇది ఓ మార్పు కాదు, ఇది రణరంగాన్ని మార్చే విప్లవం. భారత్ ఇప్పుడు ఆయుధ సామర్థ్యం పరంగా తనకు తానే నిలబడుతోంది. రేపటి యుద్ధాలను గెలవాలంటే, ఈ మార్గమే మార్గదర్శిగా ఉంటుంది. మన సరిహద్దులు బలపడతాయి, మన భద్రత మన చేతుల్లో ఉంటే... శాంతి అనేది సాధ్యం అవుతుంది. ఎటు వైపు శత్రువు అడుగు వేస్తాడో ముందే స్పందించే శక్తి మన దేశానికి వస్తే... ధైర్యానికి హద్దులే ఉండవు!

Tags:    

Similar News