భారత వాతావరణ శాఖ చల్లని కబురు.. రాబోయే సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

జులై నాటికి దేశమంతటా విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు

Update: 2024-04-15 12:38 GMT

భారత వాతావరణ శాఖ చల్లని కబురు.. రాబోయే సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

Weather Report: భానుడి భగభగలకు అల్లాడుతున్న దేశ ప్రజలకు ఇది చల్లని వార్త. రాబోయే వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జులై నాటికి దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. సగటు వర్షపాతం 106 శాతం కంటే ఎక్కువంగా ఉంటుందని IMD అధికారులు ఇవాళ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని తెలిపారు. మండిపోతున్న ఎండలకు బయటకు రావాలంటేనే జంకుతున్నప్రజలకు వాతావరణ అధికారులు నిజంగానే ఉపశమనం కలిగించే చల్లని కబురు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ అధికారులు చెప్పిన వార్త.. ప్రజలకు ఊరటనిచ్చేలా ఉంది.
Tags:    

Similar News