Aditya L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1

Aditya L1: భూమికి 15 లక్షల కి.మీ. దూరం నుంచి సూర్యుడిపై అధ్యయనం

Update: 2023-09-02 06:52 GMT

Aditya L1 : నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1

Aditya L1: చంద్రయాన్-3 విజయం తర్వాత రోజుల వ్యవధిలోనే సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధమయింది. సూర్యుడిపైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయాగించింది. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ఆదిత్యను తీసుకుని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగసింది. శ్రీహరికోటలోని షార్ ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ ను ప్రయోగించారు. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నాలుగు నెలల పాటు ప్రయాణించి సూర్యుడి దిశగా లగ్రాంజ్1 పాయింట్ కు చేరుకుంటుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యుడిని ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది. సూర్యుడిపై సౌర తుపానులు, సౌర రేణువులు, దానిపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఆదిత్యలో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్, కరోనాను కూడా అధ్యయనం చేయనున్నాయి.

Tags:    

Similar News