India Pakistan War: టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసం చేసిన భారత్
India Pakistan War: ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లను భారతీయ ఆర్మీ పేల్చివేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్ లు పేల్చి వేతకు సంబంధిచి వీడియోని భారతీయ ఆర్మీ రిలీజ్ చేసింది.
India Pakistan War: టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసం చేసిన భారత్
India Pakistan War: ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లను భారతీయ ఆర్మీ పేల్చివేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్ లు పేల్చి వేతకు సంబంధిచి వీడియోని భారతీయ ఆర్మీ రిలీజ్ చేసింది. లాంచ్ ప్యాడ్ దగ్గర ఉగ్రవాదులకు చెందిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కొనసాగినట్టు ఆర్మీ వెల్లడించింది. భారతీయ పౌరులు, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ఆ కేంద్రాలను లాంచ్ ప్యాడ్ లుగా వాడుకుంటున్నట్టు ఆర్మీ చెప్పింది. వేగవంతమైన , నిర్ణయాత్మకమైన చర్యల వల్ల ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, సామర్ధ్యానికి తీవ్రమైన దెబ్బ తగిలనట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా టెర్రర్ లాంచ్ ప్యాడ్లపై దాడులు చేశామని ఆర్మీ ప్రకటించింది.
పాక్ దాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ విధించింది. కీలక ప్రాంతాల్లో హైసెక్యూరిటీని పెంచింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, విమానాశ్రయాలు, పుణ్యక్షేత్రాలల్లో నిఘా పెంచారు. ఢిల్లీలోని ఆగ్రాలోని విమానాశ్రయం నుంచి తాజ్ మహల్ వరకు ప్రత్యేక నిఘా పెంచారు. డ్రోన్ లను పూర్తిగా నిషేధించారు. ప్రతి రోజు తనిఖీలు ముమ్మరం చేశారు. హోటళ్లలో బస చేసే విదేశీయుల గురించి యాజమాన్యం వెంటనే సమాచారాన్ని అందించాలని కేంద్రం ఆదేశించింది.