సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్, చైనా కొత్త ఒప్పందం

Update: 2020-11-12 04:29 GMT

ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలకు ఇకపై తెరపడబోతోందా ? ఈ నెల 6న జరిగిన కమాండర్ స్థాయిలో చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ? ఈసారైన డ్రాగన్ కంట్రీ మాటమీద నిలబడుతుందా తోకజాడిస్తుందా ?

భారత్, చైనా బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయ్. డ్రాగన్ కంట్రీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాదు అని చెప్పలేమంటూ డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ చేసిన ప్రకటన తర్వాత మరింత టెన్షన్ కనిపించింది. లద్దాఖ్ దగ్గర రెండు దేశాలకు చెందిన బలగాలు మోహరించి ఉన్నాయ్. చైనాగాళ్లు ఓవరాక్షన్ చేస్తే ట్రిగ్గర్ నొక్కేందుకు మనోళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రెండు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెర పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తమ సైన్యాలను వెనక్కి పంపించేందుకు రెండు దేశాల సైన్యాలు అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మే నెలకు ముందున్న పరిస్థితిని నెలకొల్పడానికి నవంబరు 6న భారత్ చైనా సైనికాధికారుల మధ్య జరిగిన ఎనిమిదో విడత చర్చల్లో ఒప్పందానికి వచ్చాయని సమాచారం. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ముందు పాంగాంగ్ సరస్సు దగ్గర మూడుదశల్లో బలగాలను వెనక్కు మళ్లించాలి ట్యాంకులు, బలగాలను తరలించే వాహనాలు సహా సాయుధ వాహనాలను వాస్తవాధీన రేఖకు ఇరువైపులా సమాన దూరంలో వెనక్కు మళ్లించాలని తెలుస్తోంది.

తొలి దశలో భాగంగా ఒక్కరోజులోనే ట్యాంకులు, సాయుధ బలగాల వాహనాలను తమ స్థావరాలకు మళ్లించాలి. రెండో దశలో పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో మోహరించిన బలగాల్లో రోజుకు 30 శాతం చొప్పున మూడు రోజుల్లోనే వెనక్కు తీసుకోవాలి. ఫింగర్ 8 తూర్పు భాగానికి మళ్లేందుకు చైనా అంగీకరించినప్పుడు ధాన్ సింగ్ థపా పోస్ట్‌కు సమీపంగా భారత్ వెళ్లేందుకు ఓకే చెప్పింది. మూడో దశలో పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని చుషుల్, రెజాంగ్ సహా అనేక శిఖరాల నుంచి రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించాలి.

బలగాల మళ్లింపు ప్రక్రియను పరిశీలించడానికి రెండు దేశాలు సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి అంగీకరించాయ్. ఐతే గతంలో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నటించిన చైనా ఆ తర్వాత దొంగదెబ్బ తీసింది. మరి ఇప్పుడైనా మాట మీద నిలబడుతుందా అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఇక అటు మనోళ్లు కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. 

Tags:    

Similar News