By Election Results 2024: ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమిదే హవా.. ఎన్డీయే కు తప్పని షాక్..!
By Election Results 2024: ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమిదే హవా.. ఎన్డీయే కు తప్పని షాక్..!
By Election Results 2024: సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార, విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీల బైపోల్‌లో ఇండి కూటమి జయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ రెండు స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండి కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది.