Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాక ప్రదర్శన
Burj Khalifa: భారత్ కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ మిత్ర దేశం యూఏఈ తన సహృదయాన్ని చాటుకుంది.
Burj Khalifa: బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాక ప్రదర్శన
Burj Khalifa: భారత్ కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ మిత్ర దేశం యూఏఈ తన సహృదయాన్ని చాటుకుంది. వైరస్ ఉగ్రరూపం దాల్చిన వేళ యూఏఈ భారత్ పట్ల సంఘీభావం ప్రకటించింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా భవనంపై లేజర్ లైట్లతో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది. ఆ వెలుగుల్లో 'స్టే స్ట్రాంగ్ ఇండియా అనే సందేశాన్ని జోడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ట్విటర్ ద్వారా విడుదల చేసింది.