Flights Ban: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
Flights Ban: ఆగస్ట్ 31 వరకు రాకపోకలపై నిషేధం
ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు (ఫైల్ ఇమేజ్)
Flights Ban: కరోనా నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్టు 31వరకు కేంద్రం పొడిగించింది. జులై 31తో ఇంటర్నేషనల్ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. వందే భారత్ మిషన్ కింద నడుస్తు్న్న విమానాలు ఎప్పటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయని పేర్కొంది.