జార్ఖండ్ రాష్ట్రంలో ఐటీ దాడుల కలకలం

* పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయంటున్న అధికారులు

Update: 2022-11-05 06:39 GMT

జార్ఖండ్ రాష్ట్రంలో ఐటీ దాడుల కలకలం

IT Raids: జార్ఖండ్ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కుమార్‌ జైమంగళ్, ప్రదీప్‌ యాదవ్‌ల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేసినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో భాగంగానే రాంచీ, బెర్మో, పట్నాలో ఈ సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. చైబాసాలో ముడి ఇనుప ఖనిజ వ్యాపారితోపాటు మరికొందరి ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఐటీ సోదాలపై ఎమ్మెల్యే జైమంగళ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిళ్లతోనే ఈ సోదాలు నిర్వహించారని ఆరోపించారు. అయితే పన్నుల ఎగవేత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఐటీ శాఖపై బురద చల్లుతున్నారని జార్ఖండ్‌ బీజేపీ నేత ప్రతుల్‌ షాదియో దుయ్యబట్టారు.

Tags:    

Similar News