Traffic Rules: షార్ట్‌ ధరించి చెప్పులు వేసుకొని బైక్‌ నడుపుతున్నారా.. అయితే భారీ ఫైన్‌..!

Traffic Rules: ఇప్పుడు బైక్‌ నడపాలంటే హెల్మెట్‌ మాత్రమే కాదు ఫుల్‌ ప్యాంట్‌, షూస్‌ కచ్చితంగా ధరించాల్సిందే.

Update: 2023-05-20 11:30 GMT

Traffic Rules: షార్ట్‌ ధరించి చెప్పులు వేసుకొని బైక్‌ నడుపుతున్నారా.. అయితే భారీ ఫైన్‌..!

Traffic Rules: ఇప్పుడు బైక్‌ నడపాలంటే హెల్మెట్‌ మాత్రమే కాదు ఫుల్‌ ప్యాంట్‌, షూస్‌ కచ్చితంగా ధరించాల్సిందే. లేదంటే చలాన్‌ కట్టాల్సిందే. చాలా మంది చిన్న చిన్న పనుల కోసం బయటికి వెళ్లేటప్పుడు షార్ట్‌ ధరించి, స్లిప్పర్స్‌ వేసుకొని బైక్‌పై వెళుతారు. కానీ ఇది ట్రాఫిక్‌ రూల్స్‌ని విస్మరించినట్లే అవుతుంది. అందుకే ఈ మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారికి భారీగా చలాన్లు విధిస్తున్నారు. మీరు బైక్ లేదా స్కూటర్‌పై వెళుతుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

మీకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమైతే బైక్ నడిపేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలో తప్పక తెలిసుండాలి. వాస్తవానికి మోటారు వాహన చట్టం ప్రకారం బైక్ రైడర్ షార్ట్‌లకు బదులుగా ఫుల్ ప్యాంట్ ధరించాలి. ఈ నిబంధనలను పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు చలాన్‌ను వేయవచ్చు. షార్ట్ ధరించి బైక్ లేదా స్కూటర్ రైడింగ్ చేస్తే రూ. 2,000 చలాన్ వేస్తారు. చెప్పులు ధరించి బైక్‌ నడిపినా చలాన్ కట్టాల్సిందే.

మోటారు వాహన చట్టం ప్రకారం బైక్ నడిపేటప్పుడు పూర్తిగా మూసి ఉన్న షూస్ ధరించాలి. చెప్పులు ధరించి బైక్ లేదా స్కూటర్ నడుపుతుంటే పోలీసులు చలాన్ వేయవచ్చు. వాహనదారుల భద్రత కోసం ఈ నియమాలు రూపొందించారు. బైక్ నడిపేటప్పుడు బైక్ ఎగ్జాస్ట్ పైప్, హాట్ ఇంజన్ చుట్టూ ఉండేలా షూస్, ఫుల్ పెయింట్ అనే రూల్ తయారైంది. ఈ పరిస్థితిలో మీరు పూర్తి ప్యాంటు, బూట్లు ధరించి డ్రైవ్ చేస్తే అవి మిమ్మల్ని ప్రమాదం నుంచి దూరంగా ఉంచుతాయి.

Tags:    

Similar News