కుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ

*అధికారిని లడఖ్‌కు, భార్యను అరుణాచల్‌ ప్రదేశ్‌కు ట్రాన్స్‌ఫర్

Update: 2022-05-27 05:48 GMT

కుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ

Delhi: అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించే పొలిటీషయన్లను నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఒక్కసారి పదవి వచ్చిన వెంటనే చూపించే దర్పం అంతా ఇంతా కాదు. ఇక సీనియర్ అధికారులు అఖిలభారత ఉద్యోగుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. వ్యవస్థలన్నీ తమ గుప్పెట్లో ఉన్నాయని తెగ ఫీలవుతుంటారు. తాము ఆడింది ఆట పాడింది పాటగా భావిస్తుంటారు. ఇలాంటి అధికారులు వివాదాస్పదమవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది. కీలక పదవీ బాధ్యతల్లో ఉన్న ఇద్దరు అధికారులు క్రీడాకారులు ఆడుకునే స్టేడియాల్లోకి కుక్కను తీసుకెళ్లి వాకింగ్ చేసి బదిలీ వేటు వేయించుకున్నారు.

కుక్కను తీసుకొచ్చి స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ అధికారి దంపతులపై బదిలీ వేటు వేసింది కేంద్రం. సదరు అధికారిని లడఖ్‌కు భార్యను అరుణాచల్‌ ప్రదేశ్‌కు బదిలీ చేసింది. ప్రభుత్వ నిర్వహించే క్రీడలకు వేదికగా ఉన్న త్యాగరాజ్ స్టేడియాన్ని ఇటీవల మూసివేశారు. ఐతే ఐఏఎస్ అధికారి కుక్కను తీసుకొని వెళ్లడంతో దేశవ్యాప్త దుమారానికి కారణమయ్యింది. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్‌ను లడఖ్‌కు, అతని భార్యను తక్షణమే అరుణాచల్ ప్రదేశ్‌కు తరలించినట్లు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

త్యాగరాజ స్టేడియంలో సౌకర్యాల దుర్వినియోగంపై హోం శాఖ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నుండి నివేదికను కోరింది. గురువారం హోంశాఖకు ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించడంతో వారిని బదిలీ చేయాలని నిర్ణయించింది. సంజీవ్ ఖిర్వార్ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారు. మొత్తం వివాదం రాజుకోవడంతో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ స్టేడియాలను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల స్టేడియాలు రాత్రి 7 గంటలకు మూసేయడం వల్ల ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున నిర్ణయం తీసుకున్నామన్నారు కేజ్రీవాల్. 


Full View


Tags:    

Similar News