Raja Singh: నా జీవితంలో ఆ పార్టీలోకి వెళ్లేది లేదు..

Raja Singh: నా సస్పెన్షన్ గురించి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదు

Update: 2023-07-19 14:26 GMT

Raja Singh: నా జీవితంలో ఆ పార్టీలోకి వెళ్లేది లేదు

Raja Singh: గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు, కార్పోరేటర్‌పై అధికార బీఆర్ఎస్ తప్పుడు కేసులు బనాయించిందని, ఈ విషయాన్ని తాము తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకు వెళ్లామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. పోలీసులు దౌర్జన్యం చేస్తుండటంతో బీజేపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ఈటల ఈ రోజు తన వద్దకు వచ్చారని చెప్పారు. కార్యకర్తలు, కార్పోరేటర్ కుటుంబ సభ్యులతో ఈటల మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు. తన సస్పెన్షన్ గురించి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. తాను బీఆర్ఎస్ లోకి వెళ్తాననే వార్తలను రాజాసింగ్ కొట్టి పారేశారు. తన జీవితంలో ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్‌రావు తదితరులందరినీ కలుస్తానని చెప్పారు రాజాసింగ్.

Tags:    

Similar News