Narendra Modi: మహిళా బిల్లుతెచ్చే అవకాశం నాకు దక్కడం అదృష్టం
Narendra Modi: మహిళా బిల్లుతో ప్రతి మహిళ ఆత్మవిశ్వాసం పెరిగింది
Narendra Modi: మహిళా బిల్లుతెచ్చే అవకాశం నాకు దక్కడం అదృష్టం
Narendra Modi: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. బిల్లు పాస్ కావడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రదాని మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకు పార్టీ నేతలు, మంత్రులు, ఎంపీలు భారీగా చేరుకున్నారు. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి తల్లి, సోదరి, బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. రెండు సభల్లో అత్యధిక మెజార్టీతో.. రాజ్యసభలో అయితే అందరి మద్దతుతో బిల్లు పాస్‌కావడం అభినందనీయమన్నారు. బిల్లు పాస్‌కావడంతో దేశంలోని ప్రతి మహిళ ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తుకు చేరిందన్నారు. దేశంలోని ప్రతి తల్లి ఆనందంతో మమ్మల్ని ఆశీర్వదిస్తోందని.. మహిళా మణులకు ఇంతటి బృహత్తరమైన కానుక ఇచ్చే అవకాశం బీజేపీ సర్కార్‌కు దక్కడం మా అదృష్టమన్నారు మోడీ.