Home Ministry: సోనియాకు కేంద్రం షాక్‌.. రెండు ట్రస్టుల లైసెన్స్‌ను..

Home Ministry: కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీకి కేంద్రం షాక్‌ ఇచ్చింది.

Update: 2022-10-23 13:34 GMT

Home Ministry: సోనియాకు కేంద్రం షాక్‌.. రెండు ట్రస్టుల లైసెన్స్‌ను..

Home Ministry: కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీకి కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఆమె చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టుల లైసెన్స్‌ను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. లైసెన్స్‌ల రద్దుతో విదేశాల నుంచి విరాళాలు స్వీకరించే అవకాశం రెండు ట్రస్టులు కోల్పోయాయి. ఈ ట్రస్టులకు సంబంధించిన ఇన్‌కమ్ టాక్స్‌ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ విరాళాల నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చెలామణి వంటి నేరాలను గుర్తించినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ పైనా దర్యాప్తు నిర్వహించినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2020లో గల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర గర్షణ జరిగింది. ఆ సమయంలోనే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు ఆరోపణలు చేశారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ను 1991లో స్థాపించారు. వైబ్‌సైట్‌ ప్రకారం.. విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికత, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు మద్దతుగా ఈ ట్రస్ట్ పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News