Amit Shah: నక్సల్స్‌ దాడికి ధీటుగా జవాబు చెబుతాం

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌‌కౌంటర్‌లో 24కు చేరిన జవాన్ల మృతి చెందగా..మరో 31 మంది జవాన్లకు గాయాలు. ఈ ఘటనపై సమీక్షిస్తున్నాట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Update: 2021-04-04 10:27 GMT

అమిత్ షా పైల్ ఫోటో

Amit Shah: పచ్చని అడవుల్లో మళ్లీ తుపాకుల మోత దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో ఛత్తీస్‌గఢ్‌లోని తార్రెమ్‌లో రక్తపాతం మొదలైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 24 మంది జవాన్లు అమరులుకాగా.. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరో 31 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన జవాన్ల సుకుమా అడువల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుంది.

ఎన్ కౌంటర్ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘెల్ తో ఫోన్ లో మాట్లాడారు. బీజాపూర్ జిల్లాలోని టర్రెం సమీపంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ ఘటనపై ఆరా తీశారు. ఈ ఎన్‌కౌంటర్లో భద్రతా సిబ్బంది అమరులుకావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్లకు హోంమంత్రి అమిత్‌ షా శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం జవాన్లు చేసిన త్యాగాలను వృధా పోనివ్వమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని అమిత్‌ షా అన్నారు. నక్సల్స్‌ చేసిన దాడికి ధీటుగా జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

మావోల దాడిని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంతాపం ప్రకటించిన ఆయన, గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బీజాపూర్‌ ఘటనలో అమరులైన వారికి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. అమరులైన జవాన్లకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.

Tags:    

Similar News