మరోసారి ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంఖ మంత్రి అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి 11 గంటలకు ఎయిమ్స్‌లో చేరారు. ఆయన శ్వాస సంబంధ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది..

Update: 2020-09-13 02:37 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి 11 గంటలకు ఎయిమ్స్‌లో చేరారు. ఆయన శ్వాస సంబంధ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ను వీవీఐపీల కేటాయించిన సీఎస్‌ టవర్‌లో చేర్చి చికిత్స అందుస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఏర్పడటం వల్లే ఎయిమ్స్‌ లో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షా ఎయిమ్స్ లో చేరారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్టు 2న అమిత్ షా‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స కోసం గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు.

ఆగస్టు 14 నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. పోస్ట్ కేవిడ్ తర్వాత ఆగస్టు 29 న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. పోస్ట్ కేవిడ్ కేర్ కోసం ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు. అప్పుడు కూడా, శరీర నొప్పి, అలసట , మైకము ఉన్నాయి. దీంతో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నాయకత్వంలో అమిత్ షా కు చికిత్స అందించారు. దీంతో ఆగస్టు 31న డిశ్చార్జయ్యారు. అయితే మరోసారి శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు అమిత్ షాకు కరోనా వైరస్ పరీక్షలు చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అమిత్ షా ఆరోగ్యం కుదుటపడాలని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రార్ధనలు నిర్వహిస్తున్నాయి. 

Tags:    

Similar News