Delhi: ఢిల్లీలో కలకలం.. యాంటీ నార్కోటిక్స్ అధికారులపై కాల్పులు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఎదురుకాల్పులు తీవ్ర కలకలం రేపాయి.

Update: 2025-11-27 05:58 GMT

Delhi: ఢిల్లీలో కలకలం.. యాంటీ నార్కోటిక్స్ అధికారులపై కాల్పులు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఎదురుకాల్పులు తీవ్ర కలకలం రేపాయి. యాంటీ నార్కోటిక్స్‌ సెల్ అధికారులు, హిమాన్షు భావు ముఠా సభ్యుడు అంకిత్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బైక్‌పై వెళ్తున్న అంకిత్‌ను యాంటీ నార్కోటిక్స్‌ అధికారులు గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు.

అయితే.. అధికారుల నుంచి తప్పించుకునే క్రమంలో అంకిత్‌ కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పులు జరిపి అంకిత్‌ను అరెస్ట్ చేశారు అధికారులు. పలు కేసుల్లో అంకిత్‌ నిందితుడిగా ఉన్నాడు. 2020లో హర్యానా పోలీసులపై అంకిత్‌ కాల్పులు జరిపాడు. హిమాన్షు భావు గ్యాంగ్‌ షూటర్‌ అంకిత్‌పై 25వేల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు.

Tags:    

Similar News