Liquor Sales: మందుబాబుల జాగ్రత్త చర్యలు.. రెండు రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు

Liquor Sales: మందుబాబులే నిజమైన టాక్స్‌ పేయర్స్‌. వారి ద్వారా వచ్చే ఆదాయాలు ప్రభుత్వాలను ఆపదలో ఆదుకుంటున్నాయి.

Update: 2021-05-11 06:31 GMT

Liquor Sales: మందుబాబుల జాగ్రత్త చర్యలు.. రెండు రోజుల్లో వెయ్యి కోట్ల మద్యం అమ్మకాలు

Liquor Sales: మందుబాబులే నిజమైన టాక్స్‌ పేయర్స్‌. వారి ద్వారా వచ్చే ఆదాయాలు ప్రభుత్వాలను ఆపదలో ఆదుకుంటున్నాయి. మద్యం కోసం తొక్కిసలాటలూ, కరోనా నిబంధనల ఉల్లంఘనా అదే రేంజ్‌లో ఉంటుంది. తాజాగా తమిళనాడులో మందుబాబుల కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల్లోనే సుమారు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చి పడింది.

సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసివేస్తుండడంతో మందుబాబులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరు సంచులు... గోతాల నిండా మందు బాటిళ్లు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. దీంతో కేవలం శని, ఆదివారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్ల వరకు మద్యం విక్రయించినట్టు ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇంట్లో తినడానికి లేకపోయినా, మద్యం కరువు రాకూడదన్న లక్ష్యంతో అప్పులు చేసి మరీ తెగ కొనుగోలు చేసేశారు.

Tags:    

Similar News