Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. రైతులపై టియర్ గ్యాస్‌, సోనిక్‌ ఆయుధాల వినియోగం

Farmers Protest: చండీగఢ్‌లో సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాలతో.. చర్చలు జరపనున్న కేంద్రమంత్రులు అర్జున్‌, పీయూష్‌, నిత్యానంద

Update: 2024-02-15 04:42 GMT

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. మూడోరోజుకు చేరిన రైతు సంఘాల నిరసనలు

Farmers Protest: సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ చలో బాట పట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. టియర్ గ్యాస్‌ ప్రయోగించినా పోరుబాట కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళన నేటికి మూడో రోజుకు చేరుకుంది. నేడు పంజాబ్‌లో రైతు సంఘాలు రైల్‌రోకో చేపట్టనున్నాయి. రైతులకు మద్దతుగా బీకేయూ రైల్‌రోకోకు పిలుపునిచ్చింది. పంజాబ్‌లో రైల్ ట్రాక్స్‌‌పై రైతులు నిరసన తెలుపనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాక్‌లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయనున్నారు.

మరోవైపు అన్నదాతల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం మరో చర్చలకు రెడీ అయింది. చండిగఢ్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాలతో కేంద్రమంత్రులు అర్జున్, పీయూష్, నిత్యానంద చర్చలు జరుపనున్నారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News